: రాంరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ... టీ కాంగ్ నేత మృతికి సంతాపం
టీ కాంగ్రెస్ సీనియర్ నేత, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు నేటి ఉదయం హైదరాబాదు నుంచే ఆయన రాంరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి కుటుంబ సభ్యులను జగన్ ఫోన్ లోనే పరామర్శించారు. ఇదిలా ఉంటే, వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాంరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాలకు వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.