: రంగంలోకి మహిళా సంఘాలు, టీఆర్ఎస్ కార్పొరేటర్... సుశీల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్

మద్యం మత్తులో కారుతో మహిళను అడ్డగించడమే కాక, ఆమె చేయి పట్టి లాగిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు కుమారుడు సుశీల్ ఘటనకు సంబంధించి తాజాగా మహిళా సంఘాలు, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు రంగంలోకి దిగిపోయారు. సుశీల్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా నిన్న పోలీసులను కోరారు. ఈ క్రమంలో ఘటన జరిగిన ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ బాధితురాలితో కలిసి మరోమారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన సుశీల్ ను అరెస్ట్ చేయాలని సదరు కార్పొరేటర్ డిమాండ్ చేశారు. అదే సమయంలో కొన్ని మహిళా సంఘాలు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకుని సుశీల్ ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశాయి. సుశీల్ ను అరెస్ట్ చేయని పక్షంలో పోలీస్ స్టేషన్ తో పాటు మంత్రి రావెల కిశోర్ బాబు ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరించాయి.

More Telugu News