: రూ.599కే ‘స్పైస్ జెట్’ టికెట్ !

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఫ్రీ సమ్మర్ పేరిట తక్కువ ధరకే టికెట్లను విక్రయిస్తోంది. డొమెస్టిక్ విమాన సర్వీసులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ‘స్పైస్ జెట్’ టికెట్లను కేవలం రూ.599కే (బేస్ ప్రైస్) ప్రయాణికులకు అందిస్తోంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వ తేదీ అర్ధరాత్రి వరకూ తీసుకున్న ప్రతి టికెట్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ సందర్భంగా స్పైస్ జెట్ సంస్థ ఉన్నతాధికారి శిల్పా భాటియా మాట్లాడుతూ, ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన ప్రీ సమ్మర్ సేల్ ఆఫర్ ద్వారా విమాన ప్రయాణికులకు డబ్బు ఆదా అవడమే కాకుండా రద్దీ బారిన పడకుండా ఉండవచ్చని చెప్పారు.

More Telugu News