: రూ. 20 వేల కోట్లు నష్టపరిచి, అనుకున్నది సాధించుకున్న జాట్లు, రిజర్వేషన్ల బిల్లుకు ఓకే!

హర్యానాలో జాట్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. త్వరలో మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని విద్యాశాఖా మంత్రి రాంవిలాస్ శర్మ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాగా, దాదాపు వారం రోజుల పాటు తమ నిరసన కార్యక్రమాలను ఉద్ధృతంగా నిర్వహించిన జాట్లు అనుకున్నది సాధించుకున్నారు. ఈ నిరసనల్లో సుమారు రూ. 20 వేల కోట్ల విలువైన ఆస్తి నష్టం జరుగగా, పోలీసు కాల్పుల కారణంగా 16 మంది మరణించారు. రిజర్వేషన్లపై ముసాయిదాను తయారు చేయాలని అఖిలపక్షం నిర్ణయించిందని, కేంద్రంతో తమ ముఖ్యమంత్రి చర్చల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని శర్మ వివరించారు.

More Telugu News