: పిచ్ లతో సంబంధం లేకుండా గెలవాలి: టీమిండియాకు శాస్త్రి సూచన

గతేడాది జరిగిన వన్డే సిరీస్ లో భారత్ ను బంగ్లా ఓడించిన విషయాన్ని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఇంకా మర్చిపోయినట్టు లేదు. భారత్ ఇప్పుడు ఆసియా కప్ టోర్నీలో ఆడనుండడంతో గతానుభవాలను గుర్తు చేసుకుంటూ, పిచ్ లతో సంబంధం లేకుండా గెలవాలని జట్టుకు సూచించాడు. పిచ్ లలో మార్పు ఉండదని, ప్రత్యర్థి మాత్రమే మారతాడన్న విషయాన్ని ఆటగాళ్లు గుర్తుంచుకోవాలని ఆయన స్పూర్తి నింపాడు. చివర్లో పోరాడడం కాకుండా, ఆరంభం నుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడాలని హితబోధ చేశాడు. బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించాడు. కాగా, రేపు తొలి మ్యాచ్ లో భారత్-బంగ్లాదేశ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. పాక్, శ్రీలంక జట్లు బలమైనవే అయినా, బంగ్లాను తక్కువ అంచనా వేయవద్దని రవిశాస్త్రి సూచించాడు. గత కొంత కాలంగా బంగ్లాదేశ్ జట్టు ఉత్తమ ప్రదర్శన చేస్తోందని ఆయన పేర్కొన్నాడు.

More Telugu News