: సచిన్ స్పెషల్ గా '22 యార్డ్స్ టు ఫ్రీడమ్' లైబ్రరీ
రిటైర్ అయినా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పాప్యులారిటీ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం కేరళలోని మలబార్ క్రిస్టియన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక లైబ్రరీ. '22 యార్డ్స్ టు ఫ్రీడమ్' పేరుతో సచిన్ వీరాభిమాని, ప్రొఫెసర్ వశిష్ఠ ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడే ఈ గ్రంథాలయాన్ని నెలకొల్పాలనే ఆలోచన వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇందులో సచిన్ కు సంబంధించిన పుస్తకాలే ఎక్కువగా ఉండగా, మొత్తం 7 భాషల్లోని సచిన్ పుస్తకాలను ఈ లైబ్రరీలో పాఠకులకు అందుబాటులో ఉంచడం విశేషం. వాటితో పాటు పలువురు దిగ్గజ క్రికెటర్లకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.