: ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
* దేశాభివృద్ధికి దూరదృష్టితో ప్రభుత్వం కృషి.
* సబ్ కే సాథ్, సబ్ కా వికాస్ మా నినాదం.
* యువతకు ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వ పథకాలు.
* అందరికీ నివాసం, ఆహారానికి పెద్దపీట.
* జన్ ధన్ యోజన ప్రపంచంలోనే మంచి ఆర్థిక వృద్ధి పథకం.
* పేదరిక నిర్మూలన నా ప్రభుత్వ ధ్యేయం.
* ప్రజలకు భరోసాను ఇచ్చేలా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన.
* జీవన్ జ్యోతి, అటల్ బీమా యోజనలు విజయవంతం.
* రూ. 24,600 కోట్లతో పట్టణ గృహ నిర్మాణ పథకం.
* ఆహార భద్రత ద్వారా 68 కోట్ల మందికి ప్రయోజనం.
* గ్రామీణ పేదల్లో 50 లక్షల మందికి కొత్తగా వంట గ్యాస్ కనెక్షన్లు.
* సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధికి తొలి ప్రాధాన్యం.
* మైనారిటీల బడ్జెట్ లో 50 శాతం ఉపకార వేతనాలకే.
* రైతుల సంక్షేమం ద్వారానే దేశ సర్వతోముఖాభివృద్ధి.
* రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టిన కేంద్రం.
* తక్కువ ప్రీమియంతోనే పంటల బీమా ద్వారా రైతులకు భరోసా.
* భూసార పరీక్షా కార్డుల పంపిణీ.
* వేలాది క్లస్టర్ల ద్వారా ప్రకృతి వ్యవసాయం.
* రైతులకు గిట్టుబాటు ధర కోసం ఈ-మార్కెట్లు
* ఈ-మార్కెట్ల ద్వారా ఎక్కడైనా దిగుబడిని అమ్ముకునే అవకాశం.
* ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త యూరియా పథకం వినూత్నం
* దీనిద్వారా వచ్చే మూడేళ్లలో 17 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి.
* యూరియాకు వేప పూత వల్ల రైతులకు ప్రయోజనం.
* గ్రామీణాభివృద్ధిలో భాగంగా పాల ఉత్పత్తికి మరింత ప్రోత్సాహం.
* కోళ్లు, మత్య్స పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు.
* రైతుల అభ్యున్నతికి 109 కిసాన్ వికాస్ కేంద్రాలు.
* ఐదు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభం.
* గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో పనులు.
* మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్ర ద్వారా అపార ఉపాధికి అవకాశాలు.
* మేకిన్ ఇండియా ద్వారా 39 శాతం విదేశీ పెట్టుబడులు.
* ముద్రా యోజన ద్వారా ఔత్సాహిక మహిళలకు ఇతోధిక రుణాలు.
* నీతి ఆయోగ్ లో రాష్ట్రాలకు మరింత వాటా.
* పీపీపీ విధానంలో 500కు పైగా ఈ-గవర్నెన్స్ సేవలు.
* సాధ్యమైనన్ని ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల కల్పన.
* అవినీతికి ఆస్కారం లేని పాలనే లక్ష్యం.
* మౌలిక వసతుల కల్పనకు ఎనలేని ప్రాధాన్యం.
* స్మార్ట్ సిటీల అభివృద్ధి కొంత సవాలే, అయినా వెనక్కు తగ్గం.
* క్లీన్ ఎనర్జీకి మరిన్ని నిధులు, ప్రత్యామ్నాయ ఇంధనానికి ప్రోత్సాహం.
* 2022 నాటికి 175 గిగావాట్ల ప్రత్యామ్నాయ ఇంధన లక్ష్యం.
* సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు మరిన్ని రాయితీలు.
* విద్యుత్ కొరత లేని దేశంగా ఇండియా మారాలి.
* మే 2018 నాటికి అన్ని మారుమూల గ్రామాలకూ విద్యుత్.
* దక్షిణాదిలో 71 శాతం పెరిగిన విద్యుత్ ఉత్పత్తి.
* త్వరలోనే 'వన్ నేషన్ - వన్ గ్రిడ్ - వన్ ప్రైస్' కల సాకారం.
* వీధి దీపాలన్నీ ఎల్ఈడీ బల్బులతో మార్చే పనులు శరవేగం.
* రూ. 300 నుంచి రూ. 64కు తగ్గిన ఎల్ఈడీ బల్బుల ధరలు.
* సంస్కరణల అమలుకు అన్ని రాష్ట్రాలూ సహకరించాలి.