: సీఎం కుర్చీకి ఏడుగురు పోటీలో ఉన్నారు...ఇంకా నేనెందుకు?: రాధిక
ముఖ్యమంత్రి పీఠం కోసం రాష్ట్రంలో ఏడుగురు పోటీ పడుతుండగా, ఇంకా తానెందుకని ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ అన్నారు. ఓ సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో పాల్గొన్న సందర్భంగా ఆమెను భవిష్యత్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒకరు అభివర్ణించారు. దీనికి ఆమె స్పందిస్తూ, ఆ పదవిపై తనకు మక్కువ లేదని అన్నారు. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో తాను పలు సినిమాల్లో నటించానని అన్నారు. ఆయన చెప్పినట్టు వినకపోతే కొట్టేస్తారని ఆమె చెప్పారు. ఆయనతో దెబ్బలు తినకుండా నటించిన ఏకైక వ్యక్తిని తానేనని అన్నారు. సినీ నటుడు విజయ్ కాంత్ కూడా దెబ్బలు తిన్నారని చెప్పారు. ఇప్పుడు ఓ పార్టీ అధినేతగా ఉన్న విజయ్ కాంత్ టెన్షన్ పడితే పక్కనున్న వ్యక్తిని కొట్టేస్తారని, ఈ అలవాటు ఆయనకు ఎస్ఏ చంద్రశేఖర్ నుంచే అబ్బిందని అన్నారు.