: బాబుతో భూమా, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి సమావేశమయ్యారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో నడుచుకోవాల్సిన విధానంపై వారితో చంద్రబాబు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి చేరికను రామసుబ్బారెడ్; భూమా కుటుంబం చేరికను, శిల్పా సోదరులు, డిప్యూటీ సీఎం కేఈ వ్యతిరేకిస్తున్నట్టు వారికి ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి అందరితో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన వారికి వివరిస్తున్నట్టు సమాచారం.