: అభిమాని గూబగుయ్యిమనిపించిన హాలీవుడ్ హీరో
హాలీవుడ్ లో 'ట్రాన్స్ ఫార్మర్స్', 'ప్యూరీ' వంటి సినిమాల ద్వారా అశేషమైన అభిమానం సంపాదించుకున్న హీరో షియా లాబియప్ ఓ అభిమానిపై చేయిచేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే, ఈ మధ్య ఓ రియాలిటీ షోలో భాగంగా ఆక్స్ ఫర్డ్ యూనియన్ లో ఓ లిఫ్ట్ లో 24 గంటల పాటు ఈ హీరో గడిపాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభిమానులు కలిశారు. ఓ అభిమాని అయితే, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, 'ఈ క్షణం వాస్తవం'(తన అభిమాన హీరోను కలుసుకున్నది వాస్తవం) అని తాను తెలుసుకునేందుకు తన గూబపై కొట్టాలని కోరాడు. అతని కోరికను సున్నితంగా తిరస్కరించిన లాబియప్, అభిమాని మళ్లీ మళ్లీ అడుగుతూ, ఇబ్బంది పెట్టడంతో, అతని గూబగుయ్యిమనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.