: కూర్చుని నవ్వుతున్నాడు కానీ...కనిపిస్తున్నంత అమాయకుడు కాదు: తారకరత్న

నారా రోహిత్ చూసేందుకు క్లాస్ గా, బుద్ధిగా నవ్వుతూ కనిపిస్తున్నాడు కానీ, పైకి కనిపిస్తున్నంత అమాయకుడు మాత్రం కాదని నందమూరి తారకరత్న చెప్పాడు. హైదరాబాదులో నిన్న రాత్రి నిర్వహించిన 'తుంటరి' ఆడియో వేడుకలో తారకరత్న మాట్లాడుతూ, ఈ సినిమా హీరో నిజంగానే 'తుంటరి' అని అన్నాడు. సినిమాలో అందర్నీ అలరించే అంశాలు చాలా ఉన్నాయని చెప్పాడు. రోహిత్ మంచి కథలను ఎంచుకుంటాడని, కథా బలం లేకుంటే సినిమాలను అంగీకరించడని అన్నాడు. ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని భావిస్తున్నానని చెప్పాడు. ఈ సినిమా ఆడియో బావుందని, సంగీతం అందించిన సాయికార్తీక్ కి మరింత మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నాడు. సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలని తారకరత్న తెలిపాడు.

More Telugu News