: పర్యాటకులను ఆకట్టుకుంటున్న 'మంచు' విలేజ్

జపాన్ లో మంచు విలేజ్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జపాన్ లోని హొక్కైడో పర్వతాల్లో షికరిబెట్సూ అనే సరస్సు ఉంది. ఇది ప్రతి ఏటా జనవరి నెలాఖరు నుంచి మార్చి నెలాఖరు వరకు గడ్డకట్టుకుపోతుంది. దీంతో జపనీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు. ఆ సరస్సులో తొమమూ అనే మంచు గ్రామాన్ని నిర్మించారు. ఇక్కడి ఐస్ తో పెద్ద ఇగ్లూలు, గుహలు, కాఫీ షాప్ లు, బార్ లు, హోటల్, పార్క్, చర్చ్ వంటి నిర్మాణాలు చేపట్టారు. వీటిల్లో కూర్చుని కావాల్సింది ఆర్డర్ చేసుకుని ఆరగించవచ్చు. దీనిని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ నిర్మాణాల్లో కూడా సరదాగా పాలు పంచుకోవచ్చు. అక్కడే వెచ్చటి నీళ్లతో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడి సరికొత్త ఆనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

More Telugu News