: హోండా కార్లలో ఎయిర్ బ్యాగ్ లోపాలు, 58 వేల కార్లు రీకాల్!
కారు ఎయిర్ బ్యాగుల్లో లోపాలున్న కారణంగా 57,676 కార్లను రీకాల్ చేయాలని హోండా మోటార్ కంపెనీ నిర్ణయించింది. వీటిల్లో అత్యధికం 'సిటీ'లే. ఎయిర్ బ్యాగ్ లను ఉచితంగానే మారుస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, భారత కార్ మార్కెట్ లో గత 20 నెలల్లో హోండా చేస్తున్న ఆరవ రీకాల్ ఇది. జనవరి 2012, జూన్ 2013 మధ్య తయారు చేసి విక్రయించిన 49,572 సిటీ యూనిట్లలో లోపాలున్నాయని, ఆపై ఫిబ్రవరి 2012 నుంచి ఫిబ్రవరి 2013 మధ్య తయారు చేసిన 7,504 యూనిట్ల జాజ్, జనవరి 2012 నుంచి ఆగస్టు 2012 మధ్య తయారైన 600 సివిక్ యూనిట్లలో లోపాలున్నాయని తెలిపింది. ఈ కార్లను కొనుగోలు చేసిన వారికి వ్యక్తిగతంగా సమాచారం ఇస్తున్నట్టు వెల్లడించింది.