: హర్యానాలో హింసాత్మకంగా జాట్ ల ఆందోళన... పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి

ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఆరు రోజుల నుంచి హర్యానాలో జాట్ లు చేస్తున్న పోరాటం ఇవాళ హింసకు దారి తీసింది. అక్కడి రోహతక్ ప్రాంత సమీపంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మరణించారు. 9 మంది గాయపడ్డారు. దాంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసుల వాహనాలను తగలబెట్టారు. మరోవైపు రోహతక్ లో ఆ రాష్ట్ర మంత్రి కెప్టెన్ అభిమన్యు ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అంతేగాక అక్కడి మహర్షి దయానంద్ యూనివర్సిటీ పరిసరాల్లో మరో ఇంటికి కూడా నిప్పుపెట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దాంతో ఇవాళ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించి జాట్ల రిజర్వేషన్లపై చర్చించారు.

More Telugu News