: అంతా ఊహాగానమే... నేను కార్యకర్తలతో మాట్లాడనే లేదు: స్పష్టం చేసిన భూమా

కర్నూలు జిల్లాలో వైకాపా నేత భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని వచ్చిన వార్తలపై భూమా స్పందించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, తానసలు ఏ కార్యకర్తల సమావేశాన్నీ నిర్వహించలేదని, ఎవరితోనూ మాట్లాడటం కానీ, చర్చలు జరపడం కానీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన వార్తలు ఊహాగానాలేనని అన్నారు. పార్టీ మారాలనుకుంటే, తాను ధైర్యంగా వెల్లడించగలనని తెలిపారు. భూమా మీడియా సమావేశంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News