: గవర్నర్ బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నా... అమెరికా ఉపాధ్యక్ష పదవెందుకు: నిక్కీ హేలీ

రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష పదవికి తాను పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను సౌత్ కరోలినా ఇండియన్-అమెరికన్ గవర్నర్ నిక్కీ హేలీ ఖండించారు. అసలలాంటి అవకాశమే లేదని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. తన ప్లేటు ఫుల్ గా ఉందని, గవర్నర్ బాధ్యతలతో చాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. తన కుమార్తె వచ్చే ఏడాదిలో కాలేజీలో చేరబోతోందని, కుమారుడు స్కూల్ మధ్యలో ఉన్నాడని నిక్కీ తెలిపారు. ఇక తానెంతో ఇష్టపడే రాష్ట్రం ఉందని, అక్కడ తాను పూర్తి చేయాల్సిన పనులు బోలెడు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు ఓ గొప్ప వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారని ఆమె చెప్పడం విశేషం.

More Telugu News