: టీడీపీ గూటికి భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిలప్రియ?
ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయ నేతల ఆకర్ష్ కు తెరలేచింది. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఈ మేరకు తాను పార్టీ మారుతున్నానని వైసీపీ నేతలు, కార్యకర్తలతో భూమా స్వయంగా చెప్పారు. తన కుమార్తెకు మంత్రి పదవి వస్తుందని కూడా తెలిపారు.
టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల కిందట వ్యాఖ్యలు చేయగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ, తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, సంప్రదింపులు కూడా జరుపుతున్నారని అన్నారు. ఇలా ప్రకటన చేసిన రెండో రోజే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనుండటం గమనార్హం.