: నిందితులకు సహకారమా? చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు!
అగ్రిగోల్డ్ యజమానులను అరెస్ట్ చేసే విషయంలో దీర్ఘకాలం పాటు మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడిపిన ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, జీపీపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిందితుల అరెస్టులో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించిన న్యాయమూర్తి, కేసు నమోదైన ఏడాది తరువాత అరెస్ట్ చేస్తారా? అని మండిపడింది. నిందితులకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోందన్న అనుమానం తమకు ఉందని, అసలు వారికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయో లెక్క తేల్చి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతకుముందు అగ్రీగోల్డ్ సంస్థకు ఉన్న ఆస్తులు విలువైనవి కావని, రవిప్రసాద్ కమిటీ నివేదిక ఇచ్చింది. రవిప్రసాద్ నివేదికపై విచారణను వాయిదా వేసిన కోర్టు, రూ. 25 లక్షలను ఖర్చుల నిమిత్తం తక్షణం జమ చేయాలని ఆదేశాలు జారీచేసింది.