: కేసీఆర్ జాతరకు వెళ్లట్లేదు!... పర్యటన రద్దయిందంటూ సీఎంఓ ప్రకటన

వరంగల్ జిల్లాలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రోజే లక్షలాది మంది భక్తులు జాతరకు తరలిరాగా, నిన్న రాత్రి సారలమ్మ గద్దెపై ఆసీనులయ్యారు. ఈ క్రమంలో నేడు మేడారం వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఉన్నట్టుండి సీఎం మేడారం పర్యటన రద్దయింది. అనివార్య కారణాల వల్ల సీఎం మేడారం పర్యటనను రద్దు చేస్తున్నట్లు సీఎంఓ కార్యాలయం కొద్దిసేపటి క్రితం తెలిపింది. పర్యటన రద్దుకు గల కారణాలు తెలియరాలేదు.

More Telugu News