: ఫోన్ పాడైపోతే, చార్జర్, ఇయర్ ఫోన్ మిగులుతాయిగా... నెట్టింట సెటైర్ మీద సెటైర్లు!
ఎంతో ఆసక్తిని గొలుపుతూ రంగప్రవేశం చేసిన 'ఫ్రీడమ్ 251' నెట్టింట ఇప్పుడు జోక్ సెంటర్ గా మారింది. నిన్న, ఇవాళ సెర్చింజన్ సైట్లలో నెంబర్ వన్ క్వయిరీగా ఈ ఫోన్ నిలిచింది. ఇక నేటి ఉదయం నుంచి ఒక్కటంటే ఒక్క ఆర్డర్ కూడా ప్లేస్ కాలేదు. దీంతో ఈ ఫోన్ ను మార్కెటింగ్ చేస్తున్న రింగింగ్ బెల్స్ కల్పించుకుని, బుకింగ్స్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటికే సామాజిక మాధ్యమాల్లో జోకులపై జోకులు పేలుతున్నాయి. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లో ఎక్కడ ఈ ఫోన్ ప్రస్తావన వచ్చినా సెటైర్లే కనిపిస్తున్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా ట్వీట్, షేర్ చేసుకున్న సెటైర్ ఏంటో తెలుసా? "ఫోన్ పాడైపోతే, చార్జర్, ఇయర్ ఫోన్ మిగులుద్దిగా?" అని. ఇక "నేనో పది ఫోన్లు కొని బ్లాక్ లో అమ్ముదామనుకున్నా... నా ఆశ అడియాశేనా?" అని ఒకరు, "ఇదేనా మేకిన్ ఇండియా, పరువు తీశారు" అని ఇంకొకరు, "పెద్ద బాంబును అంటిస్తే తుస్సు మందని" మరొకరు... ఇలా సాగుతున్నాయి వ్యంగ్యాస్త్రాలు.