: 'ఫ్రీడమ్ 251' కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
ఫ్రీడమ్ 251, కేవలం రూ. 251 ధరలో నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న రింగింగ్ బెల్ సంస్థ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ బుకింగ్స్ అధికారికంగా ఇప్పటికే ప్రారంభమైపోయాయి. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలంటే...
* ముందు 'www.freedom251.com' వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
* అక్కడ ఫోన్ చిత్రంతో పాటు 'బై నౌ' అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* తరువాత మీ పేరు, చిరునామా, మొబైల్, ఈ-మెయిల్ తదితర వివరాలను పూర్తి చేయాల్సిన పేజీ కనిపిస్తుంది.
* ఈ ఫోన్ ధర రూ. 251 అయితే, దాన్ని మీ ఇంటికి చేర్చినందుకు రూ. 40 వసూలు చేస్తారు. అంటే మీరు రూ. 291 చెల్లించాలి.
* అన్ని వివరాలూ పూర్తి చేశాక నియమ నిబంధనలకు అంగీకరిస్తూ, క్లిక్ చేసి 'పే నౌ' ఆప్షన్ క్లిక్ చేయాల్సి వుంటుంది.
అయితే, చాలా మంది ఇదే పని చేస్తే, తిరిగి వెనక్కు వెళ్లిపోయి 'బై నౌ' స్క్రీన్ కనిపిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి ఇదే పరిస్థితి. మీరు మళ్లీ మళ్లీ ట్రై చేసి వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత కొనుగోలు చేయవచ్చు.
ఇక తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
* ఏదైనా విని, చూసి తెలుసుకునే దానికి, స్వయంగా వాడి అనుభవించే దానికి ఎంతో తేడా ఉంటుంది.
* రింగింగ్ బెల్స్ ఇప్పటివరకూ ఎటువంటి చరిత్రా లేని సంస్థ. తెలియని బ్రాండ్. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎటువంటి ట్రాక్ రికార్డూ లేదు.
* ఫోన్ క్వాలిటీ ఎలా ఉంటుందో పూర్తిగా వెల్లడి కాలేదు. ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ పై పూర్తి సమాచారం లేదు.
* ఫోన్ ఆవిష్కరణ తరువాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఎంతమందికి ఫోన్ సరఫరా చేయవచ్చన్న విషయానికి స్పష్టమైన సమాధానం చెప్పలేదు.
* ఒక ఫోన్ ఆర్డర్ చేసిన తరువాత కనీసం 4 నెలల పాటు వేచి ఉండాలి.
* కంపెనీకి ఏ చరిత్రా లేదని తెలుసుకున్న తరువాత, మనసులో ఓ సందేహం... అసలు ఫోన్ డెలివరీ కాకపోయినా కాకపోవచ్చని!
* కంపెనీ వెబ్ సైట్లో రిటర్న్ పాలసీ అనేదే లేదు. అంటే ఫోన్ నచ్చకపోతే చేసేదేమీ లేదు.
* ముందు చెప్పినట్టుగా ఫోన్ కు ఒక సంవత్సరం వారంటీని సంస్థ పొందుపరచలేదు.
ఇక ఈ ఫోన్ కొనాలా? వద్దా? అన్నది కస్టమర్ల వ్యక్తిగత అభిప్రాయం. రూ. 251 పోతే పోయిందిలే అనుకుంటే ఓ ప్రయత్నం చేయచ్చు.