: టీఆర్ఎస్ అధికారంలో భూముల గోల్ మాల్ తగ్గింది: ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల గోల్ మాల్ తగ్గిందని, ఇటువంటి సమస్యలేమైనా ఉంటే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ‘మా భూమి’ వెబ్ పోర్టల్ ను ఈరోజు ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన మరో నాలుగు వెబ్ పోర్టర్లను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, మా భూమి వెబ్ సైట్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగముంటుందని అన్నారు. త్వరలో రెవెన్యూ శాఖ విధానాన్ని ప్రకటిస్తామన్నారు. 2016 సంవత్సరాన్ని రెవెన్యూ శాఖ సంవత్సరంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

More Telugu News