: శబరిమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పై నిషేధం
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి అమ్మకంపై కేరళ హైకోర్టు నిషేధం విధించింది. ఎకో ఫ్రెండ్లీ వాతావరణం కల్పించడంలో భాగంగా ఆ పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించింది. మంచినీళ్లతో పాటు, ప్లాస్టిక్ బాటిళ్లలో ఎలాంటి ఉత్పత్తులను అమ్మరాదని కోర్టు ఆదేశించింది.