: వర్జిన్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు!

ఆస్ట్రేలియాకు చెందిన వర్జిన్ ఎయిర్ లైన్స్ సంస్థ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దారి మళ్లించారు. నిన్న సిడ్నీ నుంచి లాస్ ఏంజిల్స్ కు ఈ విమానం బయలుదేరింది. మార్గమధ్యంలో ఉండగా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో, విమానాన్ని క్వీన్స్ ల్యాండ్ లోని బ్రిస్బేన్ మళ్లించాలంటూ పైలట్ ను అధికారులు ఆదేశించారు. బ్రిస్బేన్ చేరుకున్న విమానంలో నుంచి ప్రయాణికులను దింపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విమానాన్ని తిరిగి లాస్ ఏంజిల్స్ కు పంపినట్లు వారు పేర్కొన్నారు.

More Telugu News