: బండెనక బండి కట్టి!... నేటి నుంచే సమ్మక్క, సారలమ్మ జాతర

ఒక్క తెలంగాణ నుంచే కాకుండా యావత్తు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల భక్తులు వేలాదిగా తరలివస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ పల్లెల నుంచి ఎడ్ల బండ్లపై భక్తులు వరంగల్ జిల్లా మేడారంకు తరలిరావడం ప్రారంభమైంది. గిరిజన పూజారుల ఆధ్వర్యంలో జరగనున్న వన జాతరకు తరలివచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ప్రత్యేకంగా వందలాది బస్సులను వేసింది. అమ్మవార్ల దర్శనానికి దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్నట్లు అంచనా. ఈ మేరకు సరిపడ ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. మేడారం గద్దె సమీపంలో వంద పడకల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, 150 మంది వైద్యులను అందుబాటులో ఉంచింది.

More Telugu News