: పాలకూర పండిస్తున్న రోబోలు!


వ్యవసాయం రైతులే కాదు రోబోలు కూడా చేస్తాయనడానికి జపాన్ దేశమే ఉదాహరణ. ఇక్కడి స్ప్రెడ్ అనే సంస్థ రోబో-వ్యవసాయానికి నాంది పలికింది. ప్రపంచంలోనే తొలి రోబో నియంత్రిత వ్యవసాయ క్షేత్రాన్ని ఈ సంస్థ ఏర్పాటు చేసింది. కన్సాయ్ సైన్స్ సిటీలో 47,300 చదరపు అడుగుల ఫ్యాక్టరీలో రోబో వ్యవసాయక్షేత్రాన్ని ‘స్ప్రెడ్’ ఏర్పాటు చేసింది. నాటు వేయడం మినహా మిగిలిన అన్ని పనులను రోబోలే చూసుకుంటాయి. ప్రస్తుతం రోబోలు పాలకూరను పండిస్తున్నాయి. 2017 లో తొలి దిగుబడిని పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రోబో వ్యవసాయ పద్ధతిలో కూలీల ఖర్చు ను 50 శాతం వరకు తగ్గించుకోవచ్చని, పంట పండించేందుకు అయ్యే ఖర్చులో 25 శాతం పొదుపు అవుతుందని ‘స్ప్రెడ్ ’ ప్రతినిధులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News