: షారూక్ ఖాన్ కి భద్రత పెంపు

వీహెచ్ పీ కార్యకర్తల రాళ్ల దాడి నేపథ్యంలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కి భద్రతను మరింత పెంచారు. ప్రస్తుతం గుజరాత్ లో 'రయీస్' చిత్రం షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ వద్ద భద్రతను మరింత పెంచామని, 150 మంది పోలీసులను అక్కడ ఏర్పాటు చేశామని అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని నటీనటులు, చిత్ర యూనిట్ బస చేసే హోటళ్లు, వారు వినియోగించే వాహనాలు, మొదలైన చోట్ల భారీగా భద్రత పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, షారూక్ ఖాన్ గతంలో చేసిన అసహనం వ్యాఖ్యలపై బీజేపీ, విశ్వహిందూ పరిషత్, తదితర హిందూ సంస్థలు ఆయనపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కారుపై రాళ్ల దాడి జరగడం, ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

More Telugu News