: భానుడి ప్రతాపం మొదలు!

తెలుగు రాష్ట్రాల్లో ఎండవేడి క్రమంగా పెరుగుతోంది. పొడి వాతావరణం కారణంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్ర అధికారులు తెలిపారు. రాత్రి పూట మాత్రం కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ప్రస్తుతానికి ఇది స్థిరంగానే ఉందని వివరించారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని, కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక మేఘాలు ఏర్పడతాయని తెలిపారు. కాగా, ఎండ వేడిమి పెరగడంతో విద్యుత్ కు సైతం డిమాండ్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం రికార్డు స్థాయి వేడిమి నమోదు కావచ్చని ఇప్పటికే శాస్త్రవేత్తలు అంచనా వేసిన సంగతి తెలిసిందే.

More Telugu News