: ఖేడ్ తొలి రౌండ్ లో టీఆర్ఎస్ లీడింగ్... 1,952 ఓట్ల ఆధిక్యంలో భూపాల్ రెడ్డి
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ఖేడ్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీనే ప్రధానంగా జరిగిన ఈ ఎన్నికలో టీడీపీ కూడా బరిలోకి దిగింది. ఓట్ల లెక్కింపులో భాగంగా కొద్దిసేపటి క్రితమే తొలి రౌండ్ పూర్తి అయ్యింది. తొలి రౌండ్ లో అందరూ ఊహించినట్లుగానే టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డిపై ఆయన తొలి రౌండ్ లోనే 1,952 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 21 రౌండ్లలో జరగనున్న కౌంటింగ్ నేటి ఉదయం 11 గంటల్లోగా పూర్తి కానుంది.