: 'పికాస' ఇక ఉండదు: గూగుల్


సుమారు దశాబ్దకాలం పైగా ఫోటో షేరింగ్ సేవలందిస్తూ వచ్చిన 'పికాస'ను మూసివేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. కొత్తగా ఆవిష్కరించిన గూగుల్ ఫోటోస్ పై మరింత దృష్టిని సారించేందుకే పికాసను నిలిపివేస్తున్నట్టు గూగుల్ ఫోటోస్ చీఫ్ అనిల్ సబర్వాల్ వెల్లడించారు. "రెండు రకాల ఫోటో షేరింగ్ సేవలు అనవసరమని భావిస్తున్నాం. గూగుల్ ఫోటోస్ యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాం. అందువల్లే పికాస సేవలు ఆపాలని నిర్ణయించాం. పికాసలో ఇప్పటికే ఉన్న చిత్రాలు, వీడియోలు ఆటోమేటిక్ గా యూజర్ల గూగుల్ ఫోటో ఖాతాలకు మారిపోతాయి" అని సబర్వాల్ తెలిపారు. గూగుల్ ఫోటో ఖాతాలు వద్దనుకున్న వారు పికాస ఆల్బమ్స్ లోని తమ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకుని ఆపై ఆన్ లైన్లో ఉన్న వాటిని డిలీట్ చేసుకోవచ్చని వివరించారు. నెటిజన్లకు ఏదైనా అసౌకర్యం కలిగిస్తే క్షమించాలని కోరారు.

  • Loading...

More Telugu News