: నారాయణఖేడ్ లో 11 గంటలకు 26 శాతం పోలింగ్
మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 గంటల వరకు 26 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ అధికారులు తెలిపారు. ప్రారంభంలో కొద్దిగా పోలింగ్ మందగించినప్పటికీ తరువాత ఊపందుకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ సాయంత్రం 5 గంటలవరకు జరగనున్న పోలింగ్ లో ఓటర్ల కుడిచేయి చూపుడువేలికి ఇంక్ మార్క్ వేస్తారు. మొత్తం 200 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.