: హిందూపురంలో అయుత చండీయాగం... హాజరైన నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. తొలిసారిగా తనను అసెంబ్లీకి పంపించిన అనంతపురం జిల్లా హిందూపురం ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. నిత్యం బిజీ షూటింగ్ లు ఉన్నా, ఆయన హిందూపురంలోని ఏ ఒక్క కార్యక్రమాన్ని మరిచిపోవడం లేదు. ఈ నెలలో అక్కడ జరగనున్న లేపాక్షి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్నీ తానై వ్యవహరిస్తున్న బాలయ్య... రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను ఆ ఉత్సవాలకు రప్పిస్తున్నారు.
తాజాగా నేటి ఉదయం హిందూపురంలోని ఎజీఎం గ్రౌండ్స్ లో అయుత చండీయాగం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే హోదాలో బాలయ్య యాగంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు. నిన్న మధ్యాహ్నానికే హిందూపురం చేరుకున్న బాలయ్య నిన్న రాత్రి అక్కడే బస చేసి, నేటి ఉదయం నేరుగా యాగ క్షేత్రానికి చేరుకున్నారు.