: అమెరికా అధ్యక్షులను గుర్తించడంలో అమెరికన్ల నాలెడ్జ్!

అమెరికా అధ్యక్షుల పేర్లతో పాటు మరో నలభై ఒక్క మంది పేర్లను కలిపి ఒక పత్రాన్ని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు తయారు చేశారు. దీనిని సుమారు 326 మంది అమెరికన్లకు ఇచ్చి, అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ల పేర్లను గుర్తించి టిక్ చేయమన్నారు. అనంతరం ఆ సమాధానాలను చూసిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అమెరికా అధ్యక్షులు కాని వ్యక్తులను.. అధ్యక్షులంటూ టిక్ చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అమెరికా పితామహుడు అలెగ్జాండర్ హామిల్టన్ ను యూఎస్ అధ్యక్షుడిగా దాదాపు 71 శాతం మంది గుర్తించారు. వాస్తవానికి ఆయన అధ్యక్షుడిగా పనిచేయలేదు. బెంజిమిన్ ఫ్రాంక్లిన్, థామస్ మూర్ లను అధ్యక్షులేనంటూ టిక్ చేయడం దారుణమన్నారు. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఫ్రాంక్లిన్ పియెర్స్, చెస్టర్ అర్థుర్ లను సగానికిపైగా మంది గుర్తించలేకపోయారు. కాగా, అమెరికా పౌరుల జ్ఞాపకశక్తి, జనరల్ నాలెడ్జి ఏపాటిదో తెలుసుకునేందుకే ఈ సర్వే నిర్వహించామని పరిశోధకులు తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలో అమెరికా అధ్యక్షులను సగం మందికి పైగా గుర్తించారని, తాజా సర్వే దారుణంగా ఉందని అన్నారు.

More Telugu News