: ఖేడ్ ఎన్నికలో కుడిచేయి చూపుడువేలికి ఇంకు మార్క్
మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో జరగనున్న ఉపఎన్నిక ప్రక్రియలో స్వల్పమార్పు చేశారు. ఓటరు కుడి చేయి చూపుడు వేలికి ఇంకు గుర్తు పెట్టాలని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఎన్నికల్లో ఎడమ చేయి చూపుడు వేలుకు అధికారులు ఇంకు గుర్తు పెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రేపు జరగనున్న ఉపఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.