: కర్ణాటకలో వీర జవాను హనుమంతప్ప అంత్యక్రియలు

కర్ణాటకలోని హుబ్లీ వద్ద సొంత గ్రామంలో వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కడసారిగా చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అంతకుముందు హుబ్లీలోని నెహ్రూ స్టేడియంలో ఉంచిన హనుమంతప్ప భౌతికకాయానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించారు. అతని కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా హనుమంతప్ప కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. సియాచిన్ మంచుతుపాను నుంచి బయటపడి ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంతప్ప ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

More Telugu News