: 45 ఎకరాల్లో ఏపీ తాత్కాలిక సచివాలయం... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయాన్ని మొదట అనుకున్నట్టుగా 20 ఎకరాల్లో కాకుండా 45.129 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్ డీఏ నివేదిక ఆధారంగా గుంటూరు జిల్లా వెలగపూడిలో 45 ఎకరాల్లో సచివాలయ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. వాటిలో 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.17 ఎకరాల్లో ప్రజా సదుపాయాల భవనాలను నిర్మించనున్నట్టు తెలిపింది. మరోవైపు సచివాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.