: ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు
ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఆర్ పీసీ సెక్షన్ 144, టెలిగ్రాఫ్ సెక్షన్ 5 కింద నెట్ వాడకాన్ని రద్దు చేయడంపై ఆ పిల్ లో ప్రస్తావించారు. మొత్తం నెట్ రద్దు చేయకుండా కాస్తంత సడలింపు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ... శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందన్న అనుమానం కలిగితే ఇంటర్నెట్ సర్వీసులు రద్దు చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉంటుందంటూ తీర్పు ఇచ్చింది. గతేడాదిలో పటేదార్ ఉద్యమం సమయంలో గుజరాత్ లో నెట్ సేవలను నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.