: 10 లక్షల మందిని చేరిన బాహుబలి 'కిలికి' సాంగ్!

భారత చలనచిత్ర రికార్డులను తిరగరాసిన 'బాహుబలి' చిత్రంలో కాలకేయుల జాతికి చెందిన 'కిలికి' భాషను వాడుతూ గాయని స్మిత రూపొందించిన గీతం యూట్యూబ్ లో 10 లక్షల హిట్లను దాటింది. ఈ విషయాన్ని బాహుబలి టీం పంచుకుంది. కిలికి భాషలో తీసిన ఈ పాట ఇంతమందిని చేరడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, దీనిలో తాను భాగం కావడం గర్వకారణమని కిలికి భాషను రూపొందించడంలో కృషి చేసిన మదన్ కార్కే ట్వీట్ చేశారు. "బహా కిలికి రహా కిలికి పిప్పీ ఫిలిపి జివ్లా క్రోయిక్కి ఉన్నో డున్నో మువో చావో డంబా డంబా బుగో కిలిక్కీ..." అంటూ సాగే పాటలో స్మిత స్వయంగా నృత్యం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News