: కెమికల్స్ తో అరటిపళ్లను మగ్గబెడుతున్న వ్యాపారుల అరెస్టు


అరటిపళ్లను కెమికల్స్ తో మగ్గబెడుతున్న వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్, భవానీనగర్, బహదూర్ పురా, రెయిన్ బజార్ ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈరోజు సోదాలు నిర్వహించి ఐదుగురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 103 కెమికల్ సీసాలను, 950 అరటి గెలలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కెమికల్స్ తో అరటిపండ్లను మగ్గబెట్టవద్దని మిగిలిన వ్యాపారులను హెచ్చరించామని, తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News