: అరెస్టయిన మేకకు బెయిలొచ్చిందోచ్!


కలెక్టర్ గారి తోటలోకి ప్రవేశించి అక్కడి పూల తోటలను ధ్వంసం చేస్తూ, అరెస్టయిన బుజ్జి మేకకు బెయిలొచ్చింది. మీడియాలో జరిగిన ప్రచారంతో ఆ మేక రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోగా, జంతు సంఘాల వారు మేకను అరెస్ట్ చేయడం ఏంటంటూ బాహాటంగానే విమర్శలు చేశారు. ఇక దీన్ని కోర్టు ముందు హాజరు పరచగా, బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. మేక యజమాని అబ్దుల్ హసన్ కు మాత్రం ఇంకా బెయిలు లభించలేదు. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కలెక్టర్ హేమంత్ రాత్రే ఇంటి తోటలోని కూరగాయలను, పూలను ఇది పాడుచేస్తున్నదన్న ఫిర్యాదుతో ఆమధ్య దీన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News