: బింద్రన్ వాలే పక్కనే కేజ్రీ వాల్!... పంజాబ్ లో కలకలం రేపుతున్న పోస్టర్లు
జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే గుర్తున్నాడుగా? ఖలిస్థాన్ ఉధ్యమం పేరిట అమృత్ సర్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయంలో తిష్ట వేసిన అతడు కేంద్ర ప్రభుత్వంపై దాదాపు యుద్ధమే ప్రకటించాడు. అతడిని అణచివేసేందుకే నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ఆపరేషన్ లో జర్నైల్ సింగ్ చనిపోయాడు. తదనంతర పరిణామాల్లో సిక్కుల మనోభావాలు దెబ్బతినడం... ఇందిరా గాంధీ హత్య, సిక్కులపై ఊచకోత... వెరసి జర్నైల్ సింగ్ పలు కీలక పరిణామాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. అలాంటి వివాదాస్పద చరిత్ర ఉన్న జర్నైల్ సింగ్, అవినీతిని అంతం చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒకే పోస్టర్ పై... అది కూడా పక్కపక్కనే ఉన్న పోస్టర్లు పంజాబ్ లో వెలిశాయి. 'ఆప్' పంజాబ్ శాఖ రూపొందించిన ఈ పోస్టర్లు పెను చర్చకే ఆజ్యం పోశాయి. అవకాశవాద రాజకీయాలకు, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్ ఈ తరహా చీప్ ట్రిక్కులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.