: రజిత బంతులు నిప్పులు చెరిగాయి... ధావన్ కూడా పెవిలియన్ చేరాడు!

శ్రీలంక జట్టు కొత్త కుర్రాడు తనదైన రీతిలో బంతులతో నిప్పులు చెరుగుతున్నాడు. పూణే వేదికగా కొద్దిసేపటి క్రితం టీమిండియాతో ప్రారంభమైన మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే రెండు కీలక వికెట్లు తీసిన అతడు, మూడో (ఇన్నింగ్స్ ఐదో ఓవర్) ఓవర్ లో మరో వికెట్ తీశాడు. రజిత వేసిన బంతిని బౌండరీ తరలించబోయిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (9) దనుష్క గుణతిలక చేతికి చిక్కాడు. దీంతో భారత్ తొలి ఐదు ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ధానవ్ వెనుదిరగడంతో అతడి స్థానంలో యువరాజ్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. ఏడు ఓవర్లు ముగిసేలోగా మూడు వికెట్ల నష్టానికి భారత్ 43 పరుగులు చేసింది.

More Telugu News