: విజయవాడ బీసీ సంఘాల సదస్సులో కలకలం... ఆత్మహత్యా యత్నం చేసిన యువకుడు!
విజయవాడలోని ఐలాపురం హోటల్ లో ఇవాళ జరిగిన బీసీ సంఘాల సదస్సులో ఉన్నట్టుండి గందరగోళం చెలరేగింది. కాపులను బీసీ జాబితాలో చేర్చొద్దంటూ మురళీగౌడ్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకుని యువకుని ఒంటిపై నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. దాంతో కొద్దిసేపు సదస్సులో కలకలం చోటుచేసుకుంది.