: కోదండరామస్వామి ఆలయ డిప్యూటీ ఈవో నివాసంలో రెండో రోజు సోదాలు

బైరాగపట్టెడలోని తిరుపతి శ్రీకోదండరామస్వామి ఆలయ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి నివాసంలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన సోదరుడు షణ్ముఖరెడ్డి ఇంటిలో కూడా ఇవాళ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు 26 ఇంటి స్థలాలతో పాటు మరిన్ని అక్రమాస్తులను కూడా అధికారులు గుర్తించారు. నలుగురు డీఎస్పీలు, 8 మంది సీఐలతో కలిపి పది ఏసీబీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. నిన్న(సోమవారం) బెంగళూరులోని భూపతి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.

More Telugu News