: ఇందిర జలప్రభ పథకంలో అక్రమాలు!
ఎస్సీ, ఎస్టీలకు సాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర జలప్రభలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని కాటారం క్లస్టర్ లోని ఉద్యోగులు సుమారు రూ.29 లక్షల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ ఎంఎం ఖాన్ రూ. 14 లక్షలు, పదకొండు మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఆరుగురు ఇంజినీర్లు కలిసి రూ.15 లక్షల మేరకు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీడీ ఎంఎం ఖాన్ ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.