: ‘విప్రో’లో 25 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో 25 వేల ఉద్యోగాల భర్తీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ స్వయంగా వెల్లడించారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ ఉద్యోగాల భర్తీ కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితమని చెప్పారు. తమ సంస్థకు చెందిన ఇతర బ్రాంచ్ లలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే యోచనలో ఉన్నామన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఐటీ నియామకాలు చేపట్టే అవకాశముందని ప్రేమ్ జీ తెలిపారు.

More Telugu News