: హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ రైలు వస్తోంది: భువనగిరి ఎంపీ నర్సయ్య గౌడ్

హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ రైలు సర్వీసు నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ విషయాన్ని నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఒక ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. దాంతోపాటే 65వ నంబర్ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు వచ్చే కేంద్రబడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారని నర్సయ్యగౌడ్ తెలిపారు. 65వ నంబర్ జాతీయ రహదారిని పరిశీలించేందుకుగాను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ వచ్చే వారంలో ఇక్కడికి రానున్నారన్నారు.

More Telugu News