: ముద్రగడ తన దీక్షలో భార్యను ఎందుకు కూర్చోబెట్టారు?: 'సీపీఐ' నారాయణ
కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షలో భార్యను ఎందుకు కూర్చోబెట్టారని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఆమెకు దీక్షతో ఏమి సంబంధముందని ఆయన ప్రశ్నించారు. ఆ విధంగా చేయడమంటే సతీసహగమనాన్ని ముద్రగడ ప్రోత్సహించడమేనని విమర్శించారు. ఆపదమొక్కులవాడిలా హామీలిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంలో ఇరుక్కుపోతున్నారని నారాయణ అభిప్రాయపడ్డారు. కాపు కులస్తులను బీసీల్లో చేర్చడం అంత సులువు కాదన్న సంగతి బాబుకు తెలుసని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని పార్టీలపై ఈసీ చర్యలు తీసుకోవాలని, కొరడా ఝళిపించాలని అన్నారు.