: చేతికి కట్టుతో విమానాశ్రయం బయట నేలపై కూర్చున్న చిరంజీవి!
కిర్లంపూడిలో నిరాహార దీక్షకు దిగిన ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వచ్చి అరెస్టయిన సినీ నటుడు చిరంజీవి, ఆపరేషన్ చేయించుకున్న చేతికి కట్టుతోనే మధురపూడి విమానాశ్రయం బయట నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆయనతో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు తదితరులు కూడా అక్కడే బైఠాయించారు. పోలీసుల వైఖరిని తప్పుబడుతూ, తమను కిర్లంపూడికి వెళ్లనివ్వాలని రఘువీరారెడ్డి పోలీసులతో చాలా సేపు వాగ్వాదం చేశారు. ఇప్పుడు ముద్రగడ దీక్షను విరమించారన్న వార్త తెలిసిన తరువాత, వారిని విడుదల చేసినట్టు సమాచారం.