: ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత!
కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఈరోజు రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు దీక్ష భగ్నం చేస్తారన్న సమాచారంతో ఇంట్లోకి ఎవరినీ వెళ్లకుండా ఆయన మద్దతుదారులు అడ్డుపెట్టిన కార్లను తొలగించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ దంపతులు నిరాకరించినట్లు తెలుస్తోంది. కనీసం ఫ్యామిలీ డాక్టర్లతోనైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ వారికి సూచించినట్లు తెలుస్తోంది.